నాని మతిమరుపుకు 5యేళ్లు
నేచురల్ స్టార్ నానికి మతిమరుపుకు ఐదేళ్లు నిండాయ్. అదేనండీ.. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకొంది. మారుతి దర్శకత్వంలో నాని-లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. కథానాయకుడికి మతిమరుపు కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మారుతి. మతిమరుపు ఉన్న యువకుడి పాత్రలో నాని చేసిన హంగామా ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించింది.
దీంతో ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. నాని కెరీర్ లోనే తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కి లాభాల పంట పండించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. హాయిగా నవ్వుకుంటారు. అన్నట్టు.. దర్శకుడు మారుతిపై ఉన్న బూతు ముద్రని చెరిపేసిన సినిమా కూడా ఇదే. భలే భలే ఐదేళ్ల పండగని చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంటోంది. #5YrsForMemorableBBM పేరిట యూవీ క్రియేషన్స్ కొత్త పోస్టర్ ని వదిలింది. మరీ.. భలే భలే కు సీక్వెల్ ఎప్పుడు తీసుకొస్తారు ? అన్నది చూడాలి.