సుశాంత్ కేసు : వెలుగులోకి గంగూలీ పాత్ర ! 

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సుశాంత్  కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ నాలుగు రోజులపాటు విచారించింది. ఆమె సోదరుడు షోవిక్‌తోపాటు పలువురిని ప్రశ్నించి, కీలక ఆధారాలు కేసరించింది. ఇప్పుడీ కేసులో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ పాత్ర వెలుగులోకి వచ్చింది.

అసలు విషయం ఏంటంటే ? ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్‌ వ్యాపార సహచరుడు వరుణ్ మాథూర్ సీబీఐ విచారించింది. విచారణలో వరుణ్ మాథూర్ సుశాంత్ కొన్ని కీలకమైన విషయాలను బయట పెట్టారు. సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటించేందుకు చాలా ఆసక్తి చూపించాడని వెల్లడించారు. ఇది అతని డ్రీం ప్రాజెక్ట్ అని, దీనిని తన స్వీయ నిర్మాణంలో చేయాలనీ అనుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సమావేశం కూడా జరిగినట్టుగా వెల్లడించాడు.