ఐపీఎల్ నుంచి భజ్జీ అవుట్ 

చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. ఆ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వలనే టోర్నీ నుంచి తప్పుకుంటున్న భజ్జీ తెలిపారు. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో సీఎస్కే స్టార్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు చెన్నై జట్టుని కరోనా వణికిస్తోంది. ఆ జట్టులో ఏకంగా 13 మంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే 11మంది కోలుకున్నారు. తాజాగా వారి క్వారంటైన్ టైమ్ కూడా ముగిసింది. దీంతో వారు జాలీగా బయటికొచ్చారు. ఓ రెస్టారెంట్ లో భోజనం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలని సీఎస్క్ తన అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది.