గుడ్ న్యూస్ : బాలు జనరల్ వార్డ్’కు డిశ్చార్జ్
కరోనా బారినపడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం బాలు సృహాలోనే ఉన్నారు. సోమవారం కల్లా గుడ్ న్యూస్ వస్తుందని ఆశిస్తున్నామని బాలు తనయుడు ఎస్పీ చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? బాలు ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు డిశ్చార్జ్ అయ్యారట.
అంతేకాదు.. హాస్పిటల్ బెడ్ పై నుంచి ఆయన ఓ పాట కూడా పాడారంట. ఈ మేరకు బాలు పాడిన ఓ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘విశ్వం నా కోసమే విస్తరించి ఉందని.. పుడమి నా కోసమే పుట్టిందని..” అనే లిరిక్స్ తో సాగే ఈ సోలో గీతం ప్రస్తుతం రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కానీ ఇది హాస్పిటల్ బెడ్ పై నుంచి బాలు పాడిన పాట కాదు. పాట పాడింది బాలూనే అయినప్పటికీ.. ఇది గతంలో ఆయన ఓ కవితకు ఇచ్చిన గీతరూపమని చెబుతున్నారు. ఏదేమైనా.. బాలు కోలుకుంటున్నారన్న న్యూస్ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.