తెదేపా నేతలకి ఖుషి చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తెదేపా నేతలని సంతోష పెట్టారు. తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెలంగాణ పదో తరగతి పాఠ్యాంశంలో చేర్చారు. సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ కి సంబంధించిన జీవిత విశేషాలను అందులో పొందుపరిచారు. దీనిపై తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్’కు కృతజ్ఝతలు తెలియజేస్తున్నారు.
ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన పథకాలను పాఠ్యాంశంలో ప్రస్తావించారు. కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. 1982లో తెదేపాని స్థాపించి.. అతి తక్కువకాలంలోనే అధికారంలో తీసుకొచ్చిన తీరుని వివరించారు. ఎన్ టీఆర్ పిలుపుతోనే కేసీఆర్ తెదేపాలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్ టీఆర్ పై అభిమానంతో కేసీఆర్.. తన తయుడుకి కూడా అదే పేరుని పెట్టుకున్నారు.
తెలంగాణా లో అన్న గారి జీవితం పాఠ్యాంశంగా చేర్చడం ఆనందకరం.
తెలుగుదేశం పుట్టింది తెలంగాణ గడ్డ మీద.అక్కడ ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థ ని తొలగించింది రామరావు గారు🙏#గోరంట్లజోహార్ అన్న ఎన్టీఆర్🙏 pic.twitter.com/LU6i4B4ds0
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) September 4, 2020