ఈఎస్ఐ కేసు.. 12 మంది అరెస్ట్ !

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ఈఎస్ఐ కేసులో ఏసీబీ అధికారులు 9మందిని అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులతో డొల్ల కంపెనీల ద్వారా వైద్య కిట్లను కొనుగోలు చేసిన కేసులో వీరిని అరెస్టు చేశారు. రూ. 6.5 కోట్లు స్వాహా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.

ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ దేవికారాణి, ఇతర అధికారులు.. ఫార్మా కంపెనీల ప్రతినిధులు కలిసి కొనని మందులకు బిల్లులు సృష్టించినట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ కే పద్మ, మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత ఇందిర, ఓమ్నీ మె డీ ఎండీ శ్రీహరిబాబు అలియాస్‌ కే బాబ్జీ, అతని భార్య, ఓమ్నిహెల్త్‌కేర్‌ ఎండీ సుజాత, లెజెండ్‌ కంపెనీకి చెందిన కే కృపాసాగర్‌రెడ్డి, హోమోక్యూ రీజినల్‌ మేనేజర్‌ టంకశాల వెంకటేశ్‌, ఓమ్ని మెడీ ఉద్యోగులు బండి వెంకటేశ్వర్లు, నాగరాజులపై గురువారం అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు.