హీరోయిన్’పై 10 మంది యువకుల దాడి

క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై 10మంది యువకులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో క‌లిసి సంయుక్త హెగ్డే వ‌ర్కవుట్స్ చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ ప‌దిమంది యువకులు హీరోయిన్ పై దాడి చేశారు.

పబ్లిక్ ప్లేసులో సంయుక్త హెగ్డే స్పోర్ట్స్ బ్రా వేసుకొని కసరత్తులు చేసినందుకే యువకులు దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే స్పోర్ట్స్ బ్రా ధ‌రించ‌డం నేరమా, ఇదేనా ఇండియాలో ఉన్న మాకు ఉన్న స్వాతంత్య్రం ఇదేనా ? అంటూ సంయుక్త ప్రశ్నిస్తునారు. సంయుక్త, దాడి చేసిన యువకులని పోలీసులు స్టేషన్ కి తరలించి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.