రివ్యూ : వి
చిత్రం : వి
నటీనటులు : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం : థమన్
దర్శకత్వం : ఇంద్రగంటి మోహన్ కృష్ణ
నిర్మాత : దిల్ రాజు
ఓటీటీ రిలీజ్ : అమెజాన్ ప్రైమ్
రిలీజ్ డేటు : 5 సెప్టెంబర్ 2020
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అతిథి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. నాని నటించిన 25వ సినిమా ఇది. అందులోనూ నెగటివ్ షేడ్స్ (సైకో) ఉన్న పాత్రలో నటించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరీ.. ఆ అంచనాలని ‘వి’ అందుకుందా ? అసలు వి కథేంటీ ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) దమ్మున పోలీస్ ఆఫీసర్. ఎన్నో కేసులని చేధించి పోలీసు గ్యాలంట్రీ మెడల్ ని అందుకుంటాడు. ఈ సందర్భంలో సహచరులకి పార్టీ ఇస్తున్న టైమ్ లో అపూర్వ (నివేదా థామస్) పరిచయం అవుతోంది. ఇక అదేరోజు రాత్రి ఇన్ స్పెక్టర్ ప్రసాద్ దారుణ హత్యకు గురవుతాడు. హంతకుడు నాని ఓ క్లూ వదులుతాడు. మరో నాలుగు హత్యలు చేస్తానని చెప్పేస్తాడు.
చెప్పినట్టుగానే ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ.. ఓ క్లూని వదులుతూ వెళ్తుంటాడు. ఇంతకీ ఆ హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ? ఆ హంతకుడిని పట్టుకోవడానికి ఆదిత్య చేసిన ప్రయత్నాలేంటీ.. ? హంతకుడుకి సాహెబ్ (అదితి రావు) మధ్య సంబంధం ఏంటీ ?? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది.
ప్లస్ పాయింట్స్ :
* నాని నటన
* కొన్ని థ్రిల్లింగ్ సీన్స్
* నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
* రొటీన్ కథ
* స్క్రీన్ ప్లే
* వినోదం
* సంగీతం
* స్లో నేరేషన్
ఎలా ఉందంటే ?
ఇది కొత్త కథేం కాదు. ఇది వరకు చాలా సినిమాలే వచ్చాయ్. అయితే కొత్త ట్రీట్ మెంట్ కోసం ట్రై చేశారు ఇంద్రగంటి. హంతుకుడు ఎవరు ? అని కనిపెట్టడానికి పెద్దగా టైమ్ తీసుకోలేదు. వెంటనే క్లూ ఇచ్చేశాడు. హంతుకుడు నాని డీసీపీ ఆదిత్యకు ఫోన్ చేయడంతో కథ స్వీడందుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సవాల్-ప్రతిసవాళ్లు ఆకట్టుకొంటాయ్.
అయితే కథ పడి లేచినట్టు సాగుతుంటుంది. విష్ణు (నాని) ఆర్మీ మేన్ అని తెలిసాక.. ఆదిత్య పాత్రలో పవర్ తగ్గినట్టు అనిపిస్తొంది. ఆయనలో సైకోపై కసికి బదులుగా గౌరవం పెరిగినట్టు అనిపించింది. దీంతో.. సైకోని పట్టుకోవడం కన్నా.. ఆయన గురించి తెలుసుకోవడం కోసమే ఎక్కువ సమయం కేటాయించాడు దర్శకుడు. అయితే విష్ణు భార్య సాహెబ్ మర్డర్ ట్విస్టు ని మాత్రం ఆఖరి వరకు రివీల్ చేయలేదు. మొత్తానికి.. నెక్ట్స్ ఏం జరగనుంది ? అనే ఉత్కంఠతో సినిమాని నడిపించాడు దర్శకుడు.
ఎవరెలా చేశారు ?
పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడమే నానికి తెలుసు. సైకో పాత్రలోనూ ఆయన లీనమయ్యారు. ఆయన చేసిన హత్యలు, ఆ టైమ్ లో ఎక్స్ ప్రెషన్స్ ఒళ్లు గొగురు పొడిచేలా ఉంటాయ్. అయితే హత్య చేసే టైమ్ లోనే నానిలో సైకో యాంగిల్ బయటికి కనిపిస్తుంటుంది. మిగితా టైమ్ లో మాత్రం సాదాసీదాగా కనిపించాడు నాని. దీంతో నానికి ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందనే అనుమానం ప్రేక్షకులకి కలిగించేలా చేశాడు దర్శకుడు. జర్నీ టైమ్ లో గెటప్ శ్రీను, మరో నటుడిని బయపెట్టిన సీన్ సూపర్. సైకో మాటలతో ఉచ్చపోయించేశాడు. ఇక నాని ప్రియురాయులు, భార్య పాత్రలో సాహెబ్ (అదితి) బాగా నటించింది. ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా.. బాగా చేసింది.
సుధీర్ బాబు ఫైట్ సీన్ తో సినిమా మొదలవుతోంది. ఫస్ట్ ఫైట్ లోనే సుధీర్ బాబు చేత షర్ట్ విప్పించి సిక్స్ ప్యాక్ బాడీ చూపించాడు. అయితే, ఆ తర్వాత సుధీర్ బాబు అంత పవర్ ఫుల్లుగా కనిపించిన సీన్ మరోటి ఉండదు. కేవలం ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ లా కనిపిస్తాడు. డిసీపీ పాత్రలో సుధీర్ బాబు సింపుల్ గా కనిపించారు. ఆయన ప్రియురాలు పాత్రలో నివేదా క్యూట్ గా కనిపించింది. థ్రిల్లర్ కథలని ఇష్టపడే అమ్మాయిగా ఆకట్టుకుంది.
మిగిలిన నటీనటులకి సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. కథ మొత్తం నాని, సుధీర్ బాబుల చుట్టూనే తిరుగుటుంది. నాని లేదంటే సుధీర్ బాబు ఎప్పుడూ తెరపై కనిపిస్తున్నారు. బహుశా.. వీరిద్దరు లేకుండా సింగిల్ సీన్ కూడా లేదేమో.. ! థ్రిల్లర్ సబెక్ట్ ని ఎంచుకున్నప్పుడు ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టాలి. కానీ.. విలో అంత ఉత్కంఠ సీన్స్ మిస్ అయ్యాయ్.
సాంకేతికంగా :
అమిత్ త్రివేది అందించిన పాటల్లో వస్తున్నా… వస్తున్నా పాట మాత్రమే ఆకట్టుకొనే ఉంది. నేపథ్య సంగీతంతో థమన్ ఆకట్టుకున్నారు. సినిమాలో వినోదం మిస్సయింది. సినిమా ద్వితీయార్థం బాగా స్లోగా సాగింది. సినిమాలో చాలా సన్నివేశాలకి కత్తెరపెట్టొచ్చేమో. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : వి – సగం మాత్రమే థ్రిల్ చేస్తోంది.
రేటింగ్ : 2.5/5