పర్సనల్ జిమ్ ట్రైనర్’కు ప్రభాస్ కాస్ట్లీ గిఫ్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పర్సనల్ జిమ్ ట్రైనర్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన రేంజ్‌ రోవర్‌ కారు కొనిచ్చారు. ఆ కారు పక్కన ప్రభాస్, ట్రైనర్ల్ ఫ్యామిలీ కలిసి దిగిన ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఇలా తన సహాయకులని సప్రైజ్ చేయడం ఇదేమీ కొత్తేమీ కాదు. గతంలోనూ.. ఇలా చాలా సార్లు సప్రైజ్ చేశారు.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ చిత్రంలో నటించనున్నారు. దీంతో పాటు ప్రభాస్ స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రంగా ఆదిపురుష్ తెరకెక్కనుంది. రామాయణం యుద్ధకాండతో ఈ సినిమా రాబోతుందని, వెయ్యికోట్ల బడ్జెట్ ఈ సినిమా తెరకెక్కనుంది చెబుతున్నారు. ఈ చిత్రంలో రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. ఇక సీత పాత్ర కోసం కీర్తి సురేష్, కైరా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి.