బ్రేకింగ్ : మరికాసేపట్లో రియా అరెస్ట్ 


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సోదరుడు అరెస్ట్ అయ్యారు. తాజాగా రియా కూడా ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్ సీబీ ముందు విచారణకు హాజరయ్యేందుకు రియా వెళ్తోంది. విచారణ తర్వాత ఆమెని అరెస్ట్ చేయబోతున్నట్టు సమాచారమ్.

విచారణకు వెళ్లే ముందు రియా మీడియాతో మాట్లాడారు. ప్రేమించడమే తాను చేసినా తప్పా ? అని ప్రశ్నించింది. అంతేకాదు.. అరెస్ట్ అయ్యేందుకు కూడా సిద్ధమే. కనీసం ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకోను అంటూ ఎమోషనల్ అయింది. రియా చెప్పడం వలన తాను డ్రగ్స్ తీసుకొచ్చానని ఆమె సోదరుడు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. మరీ.. రియా ఎవరి కోసం డ్రగ్స్ తెప్పించింది. సుశాంత్ కోసం మాత్రమేనా ? లేక పలువురి దానిని అందించిందా ? ? అన్నది విచారణలో తేలనుంది.