సుశాంత్ సారాని ప్రేమించింది.. నిజమే !

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూన్‌ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతి వెనుక కారణాలను వెలికితీసే క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ యవ హీరోయిన్ సారా అలీఖాన్ ని ప్రేమించాడు. ఆమెతో కలిసి థాయిలాండ్ ట్రిప్ కి వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజమేనని సుశాంత్ ఫాంహౌస్‌ మేనేజర్‌  ఆంగ్ల మీడియాతో అన్నారు.

“సారా మేడమ్‌ ఇతరులతో చాలా సౌమ్యంగా వ్యవహరిస్తుంటారు. ఆమె ఓ హీరోయిన్‌లా ప్రవర్తించేవారు కాదు. సాధారణ యువతిలా ఉండేవారు. ఫాంహౌస్‌లో పనిచేసే వారిని ఆంటీ, అంకుల్‌ అని పిలిచేవారు. సారా నన్ను రయీస్‌ భాయ్‌ అనేవారు. ఆమె సిబ్బందిని ఎంతో గౌరవించేవారు. సుశాంత్‌ కూడా తన వద్ద పనిచేసే వారిని సొంత వ్యక్తుల్లా చూసుకునేవారు.

2018 డిసెంబరులో సుశాంత్‌, సారా తమ స్నేహితులతో కలిసి థాయిలాండ్‌ ట్రిప్‌ వెళ్లారు. తిరిగి భారత్‌కు రాగానే ముంబయి విమానాశ్రయం నుంచి సుశాంత్‌, సారా నేరుగా ఫాంహౌస్‌కు వచ్చారు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు. స్నేహితులతో కలిసి ఇద్దరు మూడు రోజులు ఇక్కడే ఉన్నారు.

సుశాంత్‌ 2019 జనవరిలో సారాతో కలిసి డామన్‌ ట్రిప్‌కు ప్లాన్‌ చేశారు. అక్కడ ఆమెకు ఓ కానుక ద్వారా ప్రపోజ్‌ చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ట్రిప్‌కు వెళ్లలేదు. ఆపై కేరళకు వెళ్లడానికి ప్రయత్నించారు. అది కూడా జరగలేదు. 2019 మార్చి సమయంలో ఇద్దరు విడిపోయినట్లు నాకు తెలిసింది. జనవరి 2019 తర్వాత సారా ఫాంహౌస్‌కు రాలేదు” అని తెలిపారు.