బిగ్ బాస్ 4 : తొలివారం నామినేషన్ లోకి వచ్చింది వీరే !

ఇంతకుముందు ఎప్పుడు చూడని ఎంటర్ టైన్ మెంట్ అనే ట్యాగ్ లైన్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొదలైంది. ఆదివారం షో గ్రాండ్ గా మొదలైంది. 16 మంది కంటెస్టెంట్స్ ని హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఇందులో ఇద్దరిని సీక్రెట్ రూమ్ లో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తొలిరోజు బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగింది.

తొలిరోజు జరిగిన నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఊహించని విధంగా గంగవ్వ నామినేష్ లిస్టులోకి వచ్చేసింది. నోయల్, గంగవ్వలో ఒకరిని నామినేషన్ కి ఎంపిక చేసే క్రమంలో గంగవ్వని నామినేట్ చేశారు ఇంటి సభ్యులు. అయితే గంగవ్వ ఈజీగా సేవ్ అవుతుందని సభ్యులు ఆకాంక్షించడం విశేషం.

ఇక తొలివారానికి నామినేషన్ లిస్టులోకి అభిజిత్, సూర్య కిరణ్, అఖిల్, దివ్య, మెహబూబ్, సుజాత, గంగవ్వ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వెళ్లనున్నారు.