టాలీవుడ్ రచయితపై వేధింపుల కేసు
సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎన్బీటీనగర్లో నివసించే రమణగౌతమ్ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతిని(24) ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో గతేడాది జూన్లో భర్తపై ఆమె వేధింపులు, మోసం కింద బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సెలింగ్ ఇవ్వడంతో కలిసి ఉండేందుకు అంగీకరించారు.
కొన్నాళ్ల నుంచి రమణగౌతమ్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు ఫోన్లు చేసి కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్లో పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడట. దీనిపై యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తన సోదరి గురించి ఇతరుల దగ్గర అసభ్యకరంగా మాట్లాడుతున్నారాట.