గుత్తా జ్వాల-విష్ణు విశాల్ నిశ్చితార్థం


ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల రెండో పెళ్లికి రెడీ అయింది. ఆమె కొన్నాళ్లుగా తమిళ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విష్ణును వివాహం చేసుకోబోతున్నానని గుత్తా గతంలోనే సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు.

తాజాగా వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. సోమవారం గుత్తా 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పుట్టినరోజునే వీరు నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకుట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉంగరంతో తీసుకున్న ఫొటోల్ని విష్ణు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

2005లో గుత్తా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరు విడిపోయారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. ఇలా తొలి పెళ్లి పెటాకులైన వీరిద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోబోతున్నారు.