తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్
తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో’ల వ్యవస్థని రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు ఈ సాయంత్రం జరగబోయే కేబినే భేటీలో ఆమోదించనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇవాళ్టి నుంచి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా రాబోయే రోజుల్లో ఎమ్మార్వోల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు సీనియర్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇవాళ్టీ కేబినేట్ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.