Breaking : సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకొంది. సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బాత్ రూమ్ లో కుప్పకూలిపోయినట్టు తెలిసింది. కరోనా లాక్‌డౌన్ నుంచి జయ ప్రకాష్ రెడ్డి గుంటూరులోనే ఉంటున్నారు. అక్కడే బాత్ రూమ్ వెళ్లి సమయంలో గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయారు.

1946 అక్టోబర్ 10న జయప్రకాష్ రెడ్డి జన్మించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరిసిళ్ల జయ ప్రకాష్ రెడ్డి సొంత గ్రామం. సినిమాల్లోకి రాకముందు జయప్రకాష్ రెడ్డి ఎస్సైగా పని చేశారు. పలు నాటకాల్లోనూ నటించారు. ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రాయలసీమ మాండలికంలో విలన్ గా పాత్రలో అదరగొట్టడం జయప్రకాశ్ రెడ్డి ప్రత్యేకత.

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గానూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు జయప్రకాష్ రెడ్ది. శత్రువ్రు, లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, చిత్రం భలారే విచిత్రం, జంబలకిడి పంబా, ప్రేమించుకుందా రా, జయం మనదేరా, సమరసింహారెడ్ది తదితర చిత్రాల్లో జయప్రకాష్ రెడ్డి నటించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం సరిలేరు నీకెవ్వరు. పలు కన్నడ సినిమాల్లో జయ ప్రకాష్ రెడ్డి నటించారు. జయప్రకాష్ రెడ్డి సడెన్ డెత్ తో టాలీవుడ్ కు షాక్ తగిలింది.