ఆక్స్ ఫర్డ్ కరోనా వాక్సిన్.. ట్రయల్స్ ఆగడానికి అసలు కారణం ఇదే.. !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారికి వాక్సీన్ కి కనుగొనేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే భారత్ మాత్రం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తీసుకొస్తున్న ‘ఆస్ట్రాజెనికా’ వాక్సిన్ పైనే ఆశలు పెట్టుకొంది. ఇప్పుడీ వాక్సీన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కి బ్రేక్ పడంది.

30వేల మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కి ప్లాన్ చేశారు. అయితే బ్రిటన్ కి చెందిన వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఆయన న్యూరోలాజీ సమస్య వచ్చిందని చెబుతున్నారు. దీంతో ‘ఆస్ట్రాజెనికా’ ట్రయల్స్ కి తాత్కాఌక బ్రేక్ ఇస్తున్నట్టు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. అలాగని.. ఈ వాక్సీన్ ఫెయిల్ కాలేదు. బ్రిటన్ వ్యక్తికి వాక్సిన్ వలనే ఈ సమస్య వచ్చిందా ? లేదా ఇతర కారణాల వలన వచ్చిందా ? అన్నది తేల్చుకున్నాక ముందుకు వెల్లనున్నారు. వాక్సీన్ తీసుకురావడంలో ఆలస్యమైన సెఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం బ్రేక్ తీసుకున్నారని చెబుతున్నారు.