రియాని బలవంతం చేశారట

బాలీవుడ్ హీరో  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోనిక్ చక్రవర్తి, మరికొందరు అరెస్ట్ చేశారు. రియాకు సెప్టెంబర్‌ 22 వరకు జ్యూడీషియల్‌ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.  నేరం రుజువైతే రియా, ఆమె సోదరుడు షోవిక్‌  10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్షపడొచ్చని చెబుతున్నారు. ఇక రియా రెండోసారి బెయిల్ కోసం దరాఖాస్తు చేసుకొంది.

తనకు జైల్లో ప్రాణభయం ఉన్నదనీ, తనపై మోపినవి బెయిలబుల్‌ నేరాలు కనుక తక్షణమే తనకు బెయిల్‌  మంజూరు చేయాల్సిందిగా ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. తాను అమాయకురాలిననీ, తనని తప్పుడు కేసులో ఇరికించారనీ రియా తన బెయిల్‌  పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక రియా చేత నరం బలవంతంగా ఒప్పించారు. విచారణ సందర్భంగా ఒక్క మహిళా పోలీస్ అధికారి లేరని రియా న్యాయవ్యాది ఆరోపించారు.

అరెస్ట్ కు ముందు మీడియాతో మాట్లాడిన రియా.. తాను అసలు బెయిల్ కోసం అప్లై చేసుకొను. అరెస్ట్ అవ్వడానికి సిద్ధం. సుశాంత్ ని ప్రేమించడమే తాను చేసినా తప్పా ? అని ఆవేధన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.