సూపర్ న్యూస్ : ప్రభాస్-రాముడు, అనుష్క-సీత !

ప్రభాస్ రాముడు అయితే సీత ఎవరు ? కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం. ఆ సీత అనుష్క అయితే అభిమానుల ఆందానికి అవధులుండవేమో. కానీ ఇక్కడ అనుష్క అంటే స్వీటీ అనుష్క కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ అనుష్క శర్మ. అవునూ.. ఆదిపురుష్ లో సీత పాత్ర కోసం కీర్తి సురేష్, కైరా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో చిత్రబృందం చర్చలు జరుపుతుందట.

ఆదిపురుష్ కథ వినగానే.. అనుష్క థ్రిల్ అయ్యారని చెప్పకొంటున్నారు. ప్రస్తుతం అనుష్క ప్రెగ్నెంట్ కదా ? ఆమె ఎలా నటిస్తుంది అంటే.. ?? జనవరిలోనే అనుష్క బిడ్డకు జన్మనివ్వనుంది. ఆదిపురుష్ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే సమ్మర్ లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అనుష్క సీతగా కనిపించేందుకు పెద్దగాఇబ్బందులు ఉండవని చెప్పుకొంటున్నారు. 

యంగ్ రెబల్ స్టార్ నటించనున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ యుద్ధకాండ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. రావణాసురుడు పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ని తీసుకొన్నారు. సీత పాత్ర కోసం అనుష్క, కీర్తి సురేశ్, కైరా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఎవరు ఫిక్స్ అవుతారు ? అన్నది చూడాలి.

ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు.