రివ్యూ : బంగారు తల్లి

చిత్రం : బంగారు తల్లి (2020)

నటీనటులు  : జ్యోతిక‌, భాగ్యరాజ్‌, పార్థీబ‌న్

సంగీతం : గోవింద్ వసంత్

దర్శకత్వం :  జేజే ఫ్రెడ్రిక్

నిర్మాత :  సూర్య ( 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్)

రిలీజ్ డేట్ : 11సెప్టెంబర్, 2020

ఓటీటీ రిలీజ్ : ఆహా

కరోనా లాక్‌డౌన్ తో థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఓటీటీకి కనెక్ట్ అయ్యారు. రోజురోజూకి ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాల జాబితా కూడా పెరుగుతోంది. తాజాగా ‘బంగారు తల్లి’ ఆహాలో రిలీజైంది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకత్వంలో జ్యోతిక‌, భాగ్యరాజ్‌, పార్థీబ‌న్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. చిన్నపిల్ల‌ల వ‌రుస కిడ్నాప్ ఉదంతాల నేప‌థ్యంలో నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ ఇన్విస్టేగేషన్. ప్రచార చిత్రాల్లో కథ-కథనాలు బలంగా ఉన్నాయని అనిపించింది. మరీ సినిమా మొత్తం ఎలా ఉంది? బంగారు తల్లి ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకుంది ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
వరదరాజులు సమాజంలో పేరున్న వ్యక్తి. ఇన్నాళ్లు మచ్చలేకుండా బతికా. చనిపోయెంత వరకు అలాగే బతకాలన్నది ఆయన కోరిక. ఇంతలో హూఠీలో ఓ కేసు నమోదవుతుంది. అదే జ్యోతిక కేసు. ఆమె నలుగు మైనర్ బాలికలని ఘోరంగా హింసించి చంపేసిందన్నది అభియోగం. కాదు.. కేసు నిరూపించబడుతుంది. ఆమెని పోలీసులు పట్టుకొవడం, ఆమె చనిపోవడం జరిగిపోతాయ్. దాదాపు 15 యేళ్ల తర్వాత ఈ కేసుపై పెద్దిరాజు, వెన్నెల (జ్యోతిక) రివ్యూ పిటిషన్ వేస్తారు.

నిజంగానే జ్యోతిక సైకోనా. ఆమెని మైనర్ అమ్మాయిలని చంపిందా ? ఈ కేసుకు వరదరాజలకి సంబంధం ఏంటీ ? ఆయన ఒక్కనొక్క  కొడుకు ఎలా చనిపోయాడు. ఈ కేసులో వెన్నెల ఫేమస్ లాయర్ రాజారత్నంని ఎలా ఎదుర్కొంది. ఫైనల్ గా కేసుని గెలిచిందా ?? అన్నది సస్పెన్స్ ఎమోషన్స్ తో కూడా ఇన్విస్టిగేషన్ సినిమా బంగారు తల్లి.

ఎలా ఉందంటే ?

దర్శకుడు జేజే ఫ్రెడ్రిక్ కథని మొదలెట్టిన విధానం. దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. కథ చాలా సింపుల్. ప్రముఖ వ్యక్తి వరదరాజులు కొడుకు ఆయన స్నెహితుల గ్యాంగ్ చాల నీచమైంది. మైనర్ బాలికలని కిడ్నాప్ చేసి.. ఘోరంగా రేప్ చేసి చంపేసే మూర్ఖులు. జ్యోతి కూతురు వెన్నెలని అలాగే కిడ్నాప్ చేసి.. రేప్ చేస్తారు. వారిని జ్యోతి నాటు తుపాకితో కాల్చి చంపేసి.. పోలీసులకి లొంగిపోతుంది. అయితే తన పరపతితో వరదారాజులు కేసు సాక్ష్యాలన్నీ మార్చేసి.. జ్యోతికని నిందితురాలిగా నిరూపించి.. కేసుని క్లోజ్ చేస్తాడు.

ఈ కేసు క్లోజ్ అయిన 15 యేళ్ల తర్వాత ఆమె కూతురు వెన్నెల లాయర్ గా మొదటి కేసుని దీన్ని ఎంచుకుంటోంది. వరదరాజు కొడుకు దోషిగా నిరూపించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలేంటీ ? అమె మనోవేధన, ఆడపిల్లల పట్స సమాజం తీరు అన్నింటిని.. ఈ కథకి వనరులుగా బాగా వాడుకుంటున్నారు. సినిమా కథ నడిచే తీరు ‘దృశ్యం’ సినిమా మాదిరిగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది ? అనే ఉత్కంఠతో సినిమా సాగుతోంది. స్క్రీన్ ప్లే సినిమా ప్రధాన బలం.

ఎవరెవరెవరు ఎలా చేశారు. :

‘నోప్పి తెలిసినవాడే.. స్పందిస్తాడు’ అనే డైలాగ్ సినిమాలో ఉంది. జ్యోతిక కూడా అదే చేసింది. పాత్రలో లీనమైపోయింది. కోర్టు సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. కథని తన భుజాలపై వేసుకొని నడిపించింది. ఆమెని పెంచిన తండ్రి పాత్రలో నటించిన పెద్దిరాజు బాగా చేశాడు. ఫేమస్ లాయర్ పాత్రలొ నటించిన రాజారత్నం నటన బాగుంది. అయితే కైమాక్స్ లో ఆయన పాత్రని ఇంకా బలంగా చూపిస్తే బాగుండు. వరదరాజు పాత్ర బాగా పండింది. సినిమాలో స్క్రీన్ ప్లే, సంబాషణలు బాగున్నాయి. జ్యోతిక పాత్ర ద్వారా కొన్ని నగ్న సత్యాలు చెప్పించే ప్రయత్నాలు చేశాయి. అవి బోర్ కొట్టకుండా.. నిజమే కదా.. ? అని ఆలోచింప చేస్తాయి.

సాంకేతికంగా :
టెక్నికల్ సినిమా రిచ్ గా ఉంది. హూటీ, జైపూర్, చెన్నైలో సినిమా షూటింగ్ జరిగింది. హూటీ అందాలని బాగా చూపించారు. స్క్రీన్ ప్లే సినిమా ప్రధాన బలం. కథని సూటిగా చెప్పకుండా.. సన్నివేశానికి తగ్గట్టుగా రివర్స్ స్కీన్ ప్లేని బాగా వాడుకున్నారు. వెన్నెల జ్యోతిక కూతురు కాదు.. అన్నది క్లైమాక్స్ వరకు రివీల్ చేయలేదు. ఆమె వెన్నెల కాదు.. ఏంజిల్. సినిమా ప్రారంభంలో కాస్త స్లోగా సాగిన.. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ వేగం పెరిగింది. క్లైమాక్స్ ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటే బాగుండు అనిపించింది.

ప్లస్ పాయింట్స్ :
* కథ-కథనం

* జ్యోతిక నటన

* సంభాషణలు

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ స్లో నేరేషన్

ఫైనల్ గా :
బంగారు తల్లి తమిళ డబ్బింగ్ చిత్రం. కానీ అలా అనిపించదు. స్ట్రయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. బహుశా.. జ్యోతిక తెలుగు ప్రేక్షకులని బాగా తెలిసిన నటి అని కావొచ్చు. ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకొనే అంశాలన్నీ బంగారు తల్లిలో ఉన్నాయి. ఇన్విస్టిగేషన్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కాస్త ఓపికగా చూస్తే యూత్ కనెక్ట్ అవుతారు. ‘బంగారు తల్లి’ నిజంగానో గోల్డ్. కాకున్నా.. రోల్డ్ గోల్డ్ మాత్రం కాదు.

రేటింగ్ : 2.75/5
నోట్ :  ఈ రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.