బిగ్ బాస్ 4 :  డే-5 రివ్యూ.. దివి సూపర్ హిట్ !

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4కు దివి జోష్ ని తీసుకొచ్చింది. గురువారం (డే-5) ఏపీసోడ్ లో దివి (Divi vadthya) హైలైట్ అయింది. బిగ్ బాస్ ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలు చెప్పమని బిగ్ బాస్ ఆమెకి టాస్క్ ఇచ్చారు. ఆ అవకాశాన్ని దివి చాలా చక్కగా వినియోగించుకొంది. ప్రతి ఒక్క సభ్యుడి బలం, బలహీనతనలని చాలా కన్విన్స్ గా చెప్పడంలో దివి సక్సెస్ అయింది. ఏ ఒక్కరిని నొప్పించకుండా.. ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంది. ఈ ఒక్క టాస్క్ తో దివికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడం ఖాయం. గురువాం ఏపీసోడ్ లో దివి చూసిన వారంతా.. ఇంతకీ దివి ఎవరు ? అని ఆరా తీయడం మొదలెట్టారు.

దివి మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చారు. గత యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ స్టార్ మహేష్ ‘మహర్షి’ సినిమాలో నటించారు. సినిమాలో కాలేజీ ఏపీసోడ్ లో దివి కనిపిస్తుంది. ఆ ఏపీసోడ్ లో దివి చాలా క్యూట్ గా కనిపించింది. ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ దివికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అది ఆమెకి ఓటింగ్ శాతాన్ని పెంచుతోంది.

ఇక గురువారం ఏపీసోడ్ లో బిగ్ బాస్ పై నోయల్ చేసిన ర్యాప్ సాంగ్ ఆకట్టుకుంది. హోస్ట్ కింగ్ నాగార్జున, బిగ్ బాస్ షోని హైలైట్ చేస్తూ.. సాగిన నోయల్ ర్యాప్ సాంగ్ ఆకట్టుంది. ఇక ఎప్పటిలాగే గంగవ్వ.. మంచి ఎంటర్ టైన్ మెంట్ పంచింది. ఇంటి సభ్యుల గురించి గంగవ్వ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. ఇక దివి మాదిరిగానే మిగితా ఇంటి సభ్యులు తమ టాలెంట్ ని నిరూపించుకొనే పనులు చేస్టే.. షో మరింత రక్తికట్టే ఛాన్స్ ఉంది.