బ్రేకింగ్ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
సుదీర్ఘ చర్చ తర్వాత కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలు, సలహాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ధరణి వెబ్ సైట్ ఒక్కటే కాదు.. అన్నీ రకాల రికార్డులు అందుబాటులో ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
రెవెన్యూ సంస్కరణలో ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా ప్రభుత్వం చాలా సంస్కరణలు తీసుకురానుందని సీఎం కేసీఆర్ వివరించారు. అయితే చివరలో ఈ బిల్లుని సెలక్ట్ కమిటీ పంపించాలని కాంగ్రెస్ కు కోరింది. దీనిని సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. నేరుగా ఆమోదించాలని శాసన సభ, మండలిలో ఆమోదం పొందాలని అన్నారు. ఆ తర్వాత ఏకగ్రీవంగా కొత్త రెవెన్యూ చట్టాని సభ ఆమోదించింది.