నా ‘కిలాడి కృష్ణుడు’కి 40 యేళ్లు.. విజయశాంతి ట్విట్ !
విజయశాంతి..’కిలాడి కృష్ణుడు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. టాలీవుడ్ లోనూ స్టార్ హీరోలందరితో ఆడిపాడారు. కృష్ణ, ఏఎన్నార్, ఎన్టీఆర్ ల తర్వాతి తరం మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగ్.. లతో కలిసి రొమాన్స్ చేశారు. స్టార్ హీరోయిన్.. లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి రానిస్తున్నారు. ఈ యేడాది సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలో ఒక్క సినిమానే చేసిన రాములమ్మ.. మరిన్ని సినిమాలు చేయనని క్లారిటీ ఇచ్చేశారు.
ఆమె నటించిన తొలి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’ నేటితో 40యేళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా తన తొలి సినిమా జ్ఝాపకాలని ట్విట్టర్ వేదికగా పంచుకుంది రాములమ్మ. ‘నా మొదటి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు’ అంటూ విజయశాంతి ట్విట్ చేశారు.
నా మొదటి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు. pic.twitter.com/1Yjlep7YCs
— VijayashanthiOfficial (@vijayashanthi_m) September 12, 2020