బిగ్ బాస్ 4.. వీకెండ్ మాములుగా ఉండదు !

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 తొలివారం విజయవంతంగా ముగించుకోనుంది. గత ఆదివారం (సెప్టెంబర్ 6) బిగ్ బాస్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలివారం షో ఓ మాదిరిగా సాగింది. సోమ-శుక్రవారం షో ఎలా సాగినా.. శని, ఆదివారాల్లో మాత్రం ఎంటర్ టైన్ మెంట్ మాములుగా ఉండదు. బిగ్ బాస్ 4 తొలి వీకెండ్ ని కూడా జబర్థస్త్ గా ప్లాన్ చేసినట్టు అర్థమతోంది.

ఈ రోజు షోకి సంబంధించిన కొద్దిసేపటి క్రితమే ప్రోమోని విడుదల చేశారు. ఇందులో హోస్ట్ నాగ్ చేసన హంగమా మాములుగా లేదు. ఇంటి సభ్యులతో ఓ ఆటాడుకున్నట్టు అర్థమవుతోంది. అమ్మాయిని పైన కూర్చోబెట్టుకొని పుషప్స్ చేయించాడు. అమ్మ రాజశేఖర్ పై వేసిన సటైర్ హైలైట్ గా నిలిచింది. నాగ్ ప్రశ్నకి అఖిల్ సమాధానం అదిరింది. మొత్తంగా తొలి వీకెండ్   ఎంటర్ టైన్ మెంట్ మాములుగా ఉందని సింగిల్ ప్రోమోతో చెప్పేశారు.