రియా, రకుల్’లతో మంచు లక్ష్మీ… ఏంటీ సంగతి ?

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ అధికారుల విచారణలో రియా చక్రవర్తి రకుల్ పేరు చెప్పినట్టు తెలిసిందే. రకుల్ తో పాటు సారా అలీఖాన్ మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియా.. రకుల్, సారాలని ఆహ్వానించింది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి.
 
అదే సమయంలో రియా, రకుల్, మంచులక్ష్మీ కలిసి దిగిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీంతో.. రియా, రకుల్ లతో మంచి లక్ష్మీ ఏంటీ సంగతి అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ డ్రగ్స్ కోణంలో మంచి లక్ష్మీ పేరు కూడా తెరపైకి వస్తుందా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. రకుల్ కు మంచి లక్ష్మీ మంచి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరితో రియా ఉండటం అనుమానాలకి తావిస్తోంది. మరీ.. ఆ ఫోటో ఏ సమయంలో దిగినది అన్నదానిపై లక్ష్మక్క క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో.. !