బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్, సారా.. ఇంకా ఎవరున్నారంటే.. ?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగారు. సుశాంత్ గర్ల ప్రెండ్ రియా, ఆమె సోదరుడు షోనిక్ చక్రవర్తిలని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. మరికొందరిని కూడా అదుపులోని తీసుకొన్నారు. అయితే ఈ కేసు విచారణలో తీగ లాగితే డొంక కదులుతుందని తెలుస్తోంది. విచారణలో రియా పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లని బయటపెట్టిన సమాచారమ్.
ఈ లిస్టులో బాలీవుడ్ లో రాణిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందట. ఆమెతో పాటు సుశాంత్ ప్రేమలో పడ్డ సారా అలీఖాన్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరే కాదు.. చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీరందరిని విచారించేందుకు ఎన్సీబీ అధికారులు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.
ఇక ఓ కొరియర్ సుశాంత్ ఇంటి నుంచి రియా ఇంటికి వచ్చినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అందులో డ్రగ్స్ ఉంది. అయితే అది డ్రగ్స్ అని గుర్తుపట్టకుండా… డ్రగ్స్ తో పాటు అరకిలో బరువు ఉండే ఇతర పదార్థాలని ఉంచారట. తన ఇంటికి వచ్చిన ఆ డ్రగ్ ని రియా ఎవరెవరికి ఇచ్చింది ? అన్నది విచారణలో వెలుగులోకి వస్తున్నట్టు సమాచారమ్.