వైరల్ : నార్త్ లో అల్లు అర్జున్ హవా చూశారా ?


సౌత్ లో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు.. మాలీవుడ్ లోనూ బన్నీ భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ సౌత్ స్టాకి నార్త్ లోనూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందన్న సంగతి తాజాగా రుజువైంది. మహారాష్ట్రకి వెళ్లిన బన్నీని అభిమానులు చుట్టుముట్టారు. ఆయన్ని చూడ్డానికి ఎగబడ్డారు. బన్నీ వాహనాన్ని ముందుకు కదలనివ్వలేదు.

ఇక చేసేదేం లేక.. బయటికొచ్చి బన్నీ అభిమానులకిఅభివాదం చేశారు. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ బన్నీ మహారాష్ట్రకి ఎందుకు వెళ్లినట్టు ? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన తాజా చిత్రం పుష్ప సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. బహుశా.. ఈ సినిమా కోసమే బన్నీ అక్కడికి వెళ్లారేమో.. !

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం బన్నీ రింగు రింగుల జుట్టుతో కొత్త లుక్ లోకి మారిపోయారు. ఈ సినిమాలో బన్నీకి  జంటగా రష్మిక మందన జతకట్టనుంది.