బిగ్ బాస్ 4 : సూర్య కిరణ్ అవుట్.. కుమార్ సాయి ఇన్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తొలివారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొంది. ‘సన్ డే ఈజ్ ఫన్ డే’ దానికి తగ్గట్టుగానే ఇంటి సభ్యులతో సరదా ముచ్చట్లు, ఆటలు, పాటలతో ముగించారు హోస్ట్ నాగార్జున. సన్ డే ఎంత ఫన్ ని పంచినా.. ఎలిమినేషన్ మాత్రం తప్పదుగా. తొలివారం బిగ్ బాస్ ఇంటి నుంచి సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. అందరి కంటే సూర్య కిరణ్ కి తక్కువ ఓట్లు రావడంతో.. ఆయన ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించారు.

ఇక తొలివారమే బిగ్ బాస్ సప్రైజ్ ఇచ్చారు. కొంత కంటెస్టెంట్ కుమార్ సాయిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. 15రోజుల క్వారంటైన్ తర్వాత ఆయన్ని ఇంట్లోకి పంపించారు. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు. బహుశా.. కుమార్ సాయికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉంచారేమో.. !

ఇక బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కుమార్.. ఇంటి సభ్యులని బయపెట్టే ప్రయత్నం చేశారు. ఎవరికి తెలయకుండా ఓ మూలన పడుకున్నారు. తెల్లారి లేచి చూసిన ఇంటి సభ్యులుషాక్ అయ్యారు. ఆ ఏపీసోడ్ ని సోమవారం ప్రసారం చేయనున్నారు. మొత్తానికి తొలివారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4.. ఇప్పుడే జోరందుకున్నట్టు కనబడుతోంది.