గంగవ్వ సేవ్.. కానీ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తొలివారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొంది. శనివారం షోని నాగార్జున రక్తికట్టించారు. ఇంటి సభ్యులతో సరదా సరదాగా ముచ్చటించారు. వారి చిలిపి, గడుసు పనుల గురించి తనదైన శైలిలో ప్రజెంట్ చేశారు. ఇంటి సభ్యులు సరిదిద్దుకోవాల్సిన పనుల గురించి సుతిమెత్తగా మందలించారు.

తొలివారం ఎలిమినేషన్ లిస్టులో సూర్య కిరణ్‌, అభిజిత్‌, సుజాత, మెహబూబ్‌, దివి, అఖిల్‌ సార్థక్‌, గంగవ్వ ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అభిజిత్, సుజాత, గంగవ్వ సేవ్ అయ్యారు. అయితే తొలివారంలో అందరి కంటే ఎక్కువ ఓట్లు గంగవ్వకు పోలవుతున్నాయి. ఆమె ఫస్ట్ సేవ్ అవుతారని భావించారు. కానీ, అలా జరగలేదు. అభిజిత్ ని మొదట సేవ్ చేశారు. ఆ తర్వాత సుజాత, గంగవ్వలని సేవ్ చేశారు. ఇక మిగిలిన నలుగురు సూర్య కిరణ్‌, మెహబూబ్‌, దివి, అఖిల్‌ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఈ రోజు షోలో తెలయనుంది.