బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్.. ఎవరు ?

బిగ్ బాస్ అభిమానులకి సప్రైజ్. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొద్దిసేపటి క్రితం స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో హోస్ట్ నాగార్జున దీని గురించి చెప్పేశారు. అంతేకాదు.. ఆ కొత్త కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే బిట్ సీన్ ని కూడా చూపించారు. కానీ బ్యాక్ లుక్ లో ఆయనెవరో గుర్తుపట్టడం  కష్టంగా ఉంది. మరికొద్ది గంటల్లో ఆ కొత్త కంటెస్టెంట్ ఎవరు ? అన్నది తెలిసిపోనుంది.

ఇక తొలివారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్నది ఆసక్తిగా మారింది. తొలివారం ఎలిమినేషన్ లిస్టులో సూర్య కిరణ్‌, అభిజిత్‌, సుజాత, మెహబూబ్‌, దివి, అఖిల్‌ సార్థక్‌, గంగవ్వ ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అభిజిత్, సుజాత, గంగవ్వ సేవ్ అయ్యారు. ఇక మిగిలిన నలుగురు సూర్య కిరణ్‌, మెహబూబ్‌, దివి, అఖిల్‌ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఈ రోజు షోలో తెలయనుంది.