రేపటిలోగా.. అన్ని ప్రాంతాలకు కోవిడ్ టీకాలు !
రేపటిలోగా అన్ని ప్రాంతాలకు కరోనా టీకాలు చేరనున్నాయి. అయితే అది మనదేశంలో కాదు. రష్యాలో. ప్రపంచంలోనే రష్యా తొలి కరోనా టీకా (స్పుత్నిక్-వి)ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీకాని రేపటిలోగా రష్యాలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్ టీకాలు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురషుకో విలేకర్లకు వెల్లడించారు.
ప్రజలకు పంపిణీ చేసేందకు రష్యా ఈ టీకాను విడుదల చేసిన వారానికి ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే ప్రజలకు వినియోగించడానికి రష్యా ఆరోగ్యశాఖ అనుమతులు ఇచ్చేసింది. మూడో దశ ప్రయోగాల కింద ఆ దేశంలో 40వేల మందికి వేక్సినేషన్ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి దాదాపు 100 కోట్ల మంది స్పుత్నిక్-వి టీకాను తీసుకొంటారని రష్యాకు చెందిన రష్యాన్ డైరెక్టరేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) అంచనా వేస్తోంది.