బిగ్ బాస్ 4.. తొలి ఎలిమినేషన్ ఆయనే !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తొలివారాన్నివిజయవంతంగా ముగియనుంది. అయితే తొలివారం ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు అనేది హోస్ట్ నాగార్జున ఈరోజు ప్రకటించనునారు. తొలివారం ఎలిమినేషన్ లిస్టులో సూర్య కిరణ్‌, అభిజిత్‌, సుజాత, మెహబూబ్‌, దివి, అఖిల్‌ సార్థక్‌, గంగవ్వ ఉన్న సంగతి తెలిసిందే.

వీరిలో అభిజిత్, సుజాత, గంగవ్వ సేవ్ అయ్యారు. ఇక మిగిలిన నలుగురు సూర్య కిరణ్‌, మెహబూబ్‌, దివి, అఖిల్‌ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఈ రోజు షోలో తెలయనుంది.అయితే అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారమ్. ప్రకారం.. సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ ప్రేక్షకులకి ఆయన నసగానే అనిపిస్తున్నారు. ఆయనే తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. క్లాస్ పీకడాలు లేకపోతే.. అసంతృప్తి ఎక్స్ ప్రెషన్స్ తో బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకున్నారు సూర్య కిరణ్. హౌస్ సభ్యులతో ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రేక్షకులు ఆయన్ని ఓ వారం కంటే ఎక్కువ భరించలేమని ఫిక్సపోయారు. బయటికి పంపించేస్తున్నారు.