గుడ్ న్యూస్ : కరోనా కంటే రికవరీ డబుల్

కరోనా నుంచి తెలంగాణ క్రమంగా కోలుకుంటోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,417 కొత్త కేసులు నమోదు కాగా.. 2,479 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇది సంతోషించాల్సిన విషయం. ఒకట్రెండ్ రోజుల్లోనే కరోనా కొత్త కేసుల సంఖ్య రికవరీ అవుతున్న వారి సంఖ్య డబుల్ కానున్నాయని తెలుస్తోంది.

నిన్న ఒక్కరోజే వైరస్‌ బారిన పడిన 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 974కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వైరస్‌ సోకిన వారిలో నిన్న మరో 2,479 మంది కోలుకోవడంతో కరోనాను జయించిన వారి సంఖ్య 1,27,007 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,532 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరో 23,639 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.