‘ఆన్ లైన్ క్లాసుల ఫీజు’లపై శివ బాలాజీ పోరాటం.. స్టార్స్ సపోర్ట్ లభిస్తుందా ?
నటుడు శివ బాలాజీ ఆన్ లైన్ క్లాసుల ఫీజులపై పోరాటం మొదలెట్టాడు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను ఆన్లైన్ తరగతుల నుంచి తొలగించిందని ఆయన ఆరోపించారు. పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్లైన్ తరగతుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సెలబ్రిటీల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సామాన్యుడు పరిస్థిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడీ ఈ సమస్యని శివ బాలాజీ తెరపైకి తీసుకొచ్చారు. మరీ.. ఆయనకి సినీ స్టార్స్ నుంచి మద్దతు లభిస్తుందా ? ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ కల్యాణ్ స్పందిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. పవన్ లాంటోళ్లు స్పందిస్తే.. కార్పోరేటు స్కూల్స్ ఆగడాలకి కొంతలో కొంతైనా కళ్లెం వేయొచ్చని చెబుతున్నారు. శివ బాలాజీ ఒక్కరే కాదు.. ఇదేవిధంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాకపోతే బయటికొచ్చి ఫిర్యాదు చేసే సాహాసం చేయడం లేదు.