వెలుగులోకి నూతన్ నాయుడు అరాచకాలు.. ఉద్యోగాల పేరిట కోట్ల దందా !
సామాన్యుడు సెలబ్రిటీ అయినందుకు సామాన్యులంతా గొప్పగా ఫీలయ్యారు. కానీ ఆ సామాన్యుడు నూతన నాయుడు పెద్ద చీటర్ అని ఇప్పుడు తెలుస్తోంది. శిరోముండనం, విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటికే నూతన్నాయుడుని అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. సోమవారంతో కస్టడీ పూర్తైంది.
అయితే అతడి నుంచి సరైన సమాధానాలు రానట్లు సమాచారం. తెలంగాణకు చెందిన శ్రీకాంత్‌రెడ్డికి ఎస్.బి.ఐ.లో డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని చెప్పి రూ.12 కోట్లు, నూకరాజు అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసినట్లుగా కేసు నమోదయింది. వీటికి సంబంధించిన ప్రశ్నలకి నూతన్ నాయుడు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.