ఏపీ-తెలంగాణ బస్సు సర్వీసులపై కిరికిరి తొలిగేనా ?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా పంచాయతీలే ఉన్నాయి. ఇందులో బస్సుల కిరికిరి ఒకటి. లాక్‌డౌన్‌ అనంతరం రెండురాష్ట్రాల మధ్య సర్వీసులు నడవడం లేదు. ఈ వ్యవహారంలో ఓ సమస్య ఉందని అంటున్నారు. అదేంటంటే… ? ఏపీ బస్సులు తెలంగాణలో 2.65లక్షల మేర తిరుగుతుంటే.. తెలంగాణ బస్సులు ఏపీలో 1.45లక్షల మేర మాత్రమే తిరుగుతున్నాయి. మేం ఎంత నడుపుతున్నమో మీరు అంతే నడపమని తెలంగాణ కోరుతోంది.

గట్లయితే ఎట్లా కుదురతది.. మేం 50వేల కిలో మీటర్లు తగ్గుతం. మీరు 50వేల కిలో మీటర్ల మేర పెంచుకోండి. అప్పుడు లెక్క సరిపోతదని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఇందులో తెలంగాణ ఆర్టీసీ అధికారులు నో చెప్పినరు. అయితే ఈరోజు మరోసారి ఏపీ-తెలంగాణ ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఒప్పందం కుదిరితే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట బస్సు సర్వీసులు మొదలు కానున్నాయి.