ఏపీలో 8,835 కొత్త కేసులు, 64 మరణాలు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,835 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 64 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,92,760కి చేరింది. మృతుల సంఖ్య 5,105కి పెరిగింది.
నిన్న ఒక్కరోజే 10,845 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,97,376కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 90,279 మంది చికిత్స పొందుతున్నారు.