తలసాని 3వేల ఇళ్లని మాత్రమే చూపించారా ?

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం మంత్రి తలసాని-కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క్ సవాల్ విసురుకున్న సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే మంత్రి తలసాని ఈ ఉదయం భట్టీ ఇంటికి వెళ్లారు. భట్టీని తన కారులోనే తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ లని చూపించారు. అయితే డబుల్ బెడ్ రూమ్ ల సందర్శన తర్వాత తలసాని, భట్టీ మీడియాతో మాట్లాడారు.

మొదట మీడియాతో మాట్లాడిన తలసాని.. సీఎం కేసీఆర్ మాహాత్తర ఆశయంతో బడుగు వర్గాలు ఉన్నతంగా బతకాలన్న లక్ష్యంతో డబుల్ ఇళ్ల నిర్మానానికి  శ్రీకారం చుట్టారని  చెప్పారు. విశ్వనగరంలో ఆరు  ప్రాంతాలలో డబుల్  ఇళ్లను  నిర్మిస్తున్నాం. ఆయన  వాటిలో కొన్నిటిని ఈరోజు కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్కకు చూపామన్నారు. ఆయనకు లక్ష ఇళ్లు చూపించి తీరుతానన్నారు.

ఇక భట్టీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ ఇళ్లలో ఈరోజు 3,428 ఇళ్లను చూసినట్లు చెప్పారు. వీటిలో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. కేవలం ఆరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్’లని ఒకరోజులో ఎందుకు చూపించలేకపోయారు. ఒకరోజు 3వేల ఇళ్లని మాత్రమే చూపిస్తే.. లక్ష ఇళ్లని చూపించడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది? అన్నది ప్రశ్నలుగా మారాయి.