బిగ్ బాస్ హౌస్’లోకి మరో కొత్త కంటెస్టెంట్ 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. రెండో వారంలో ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెరిగింది. హౌస్ లో రొమాంటిక్ డోస్ రోజు రోజుకి పెరుగుతోంది. కొత్త కొత్త  పేమజంటలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కూడా నడుస్తోంది. మరోవైపు, డ్యాన్సులు, స్కిట్టులతో షో ఇప్పుడిప్పుడే రక్తికడుతోంది.

ఈ నేపథ్యంలో షోని మరింత రక్తి కట్టించేందుకు కొత్త కంటెస్టెంట్ ని ఇంట్లోకి పంపించబోతున్నారు. బుధవారం షో పూర్తయిన తర్వాత ప్లే చేసిన ప్రోమో కొత్త కంటెస్టెంట్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చూపించారు. కానీ అతడు ఎవరు ? అన్నది సస్పెన్స్ లో పెట్టేశారు. బహుశా.. నందుని హౌస్ లోకి పంపిస్తున్నట్టు తెలుస్తోంది.