అద్భుతంగా యాదాద్రి క్యూ లైన్స్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నార్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఆదివారం సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లి.. ఆలయ పునర్మాణ పనులని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్యూ లైన్స్ డిజైన్ కి సీఎం ఆమోదం తెలిపినట్టు సమాచారమ్. ప్రధాన ఆలయంలో క్యూలైన్లకు సంబంధించిన పవర్‌ ప్రజంటేషన్‌ ఆర్కెటెక్టు ఆనంద్‌సాయి ఇచ్చారు. క్యూలైన్‌ అద్భుతంగా ఉండటంతో సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేసి, వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో క్యూలైన్లను పెంచే విధంగా, భక్తులు లేని రోజుల్లో క్యూలైన్లను ఒకే దగ్గరికి చేర్చే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. క్యూలైన్లు ఏ మార్గంలో వస్తుందనే అంశాలపై గతంలోనే లక్నోకు చెందిన అనుభవం ఉన్న టెక్నీషియన్స్‌ యాదాద్రి ప్రధాన ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. నూతనంగా నిర్మాణం అయ్యే ప్రసాదం కౌంటర్‌ నుంచి బ్రహ్మోత్సవ మండపం వెనుక నుంచి అష్టభుజి ప్రాకార మండలంలో నుంచి తూర్పు రాజగోపురం కింది నుంచి ఒక లైన్, బ్రహ్మోత్సవ మండపం నుంచి అష్టభుజి ప్రాకార మంపం నుంచి దక్షిణ రాజగోపురం కింది నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది.