గంగవ్వ అవస్థని అర్థం చేసుకోవాల్సిందే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మట్టి మనిషి గంగవ్వ ప్రత్యేక ఆకర్షణ. తొలివారం గంగవ్వ ఇంట్లో గంగవ్వదే హవా. అయితే రెండో వారంలో అవ్వలో ఆ జోష్ కనిపించడం లేదు. గంగవ్వకు ఏసీ గదుల్లో రోజుల తరబడి ఉండటం కష్టంగా ఉంది. ఆ వాతావారణం, అక్కడి తిండి తన ఒంటికి పడక అస్వస్థతకు లోనైంది. దీంతో బిగ్‌బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. అందరూ బాగానే చూసుకుంటున్నారు, కానీ నాకిక్కడ వాతావారణం, ఆహారం పడతలేదని ఏడుస్తూ గోడు వెల్లబోసుకుంది.
మట్టిలో తిరిగేదాన్ని, ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పింది. ఆమెను మెడికల్ రూమ్‌కు వెళ్లమని చెప్పి అక్కడ వైద్యులతో చికిత్స అందించారు. ఇక్కడ వాతారవణం పడటం లేదు. తనని బయటికి పంపించమని గంగవ్వ పరోక్షంగా బిగ్ బాస్ ని కోరింది. బిగ్ బాస్ కూడా గంగవ్వ అవస్థని అర్థం చేసుకోవాల్సిందే. ఆమె ని పూర్తిగా బయటికి పంపించకపోయినా.. ఒకట్రెండు వారాలు ఆమెని బయటే ఉంచడం మంచిది. గంగవ్వ అవస్థని బిగ్ బాస్ అర్థంకోవాలని.. అవ్వ అభిమానులు కోరుతున్నారు.