ఇంటి సభ్యులకు బిగ్ పనిష్మెంట్

బిగ్ బాస్ కొరడా రులిపించాడు. ఇంటి సభ్యులకి బిగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. వారితో బింగీలు తీయించాడు. అరె.. ఇదెపుడు జరిగింది ? గురువారం ఏపీసోడ్ లో రాలేదు కదా.. అనుకుంటున్నారా? ఈ పనిష్మెంట్ ని ఈరోజు ఏపీసోడ్ లో చూడబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇంటి సభ్యులు రూల్స్ అతిక్రమిస్తున్నారని వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్.. వారిని గార్డెన్ ఏరియాలకి పిలిచి మరీ.. గుజ్జీలు తీయించారు. బిగ్ బాస్ మేము ఇప్పటి నుంచి సమయ పాలన పాటిస్తామని ఇంటి సభ్యులు ఒకేసారి చెప్పడం ప్రోమోలో చూడొచ్చు.

ఇక గురువారం ఏపీసోడ్ లో గంగవ్వ అస్వస్థతకి గురికావడం చూశాం. ఆయనని బిగ్ బాస్ చికిత్స కోసం డాక్టర్ల వద్దకు పంపించారు. అయితే తనకి ఈ వాతావరణం పడతలేదు. తిండిపడతలేదు. ఇక్కడి నుంచి తనని పంపించమని గంగవ్వ పరోక్షంగా బిగ్ బాస్ ని కోరింది. అయితే బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం గంగవ్వని వదులుకోవడానికి సిద్ధం లేదు. ఆమెని గెస్ట్ రోల్ మాదిరిగా అప్పుడప్పుడు మాత్రమే ఇంట్లో కొనసాగిస్తూ.. షోని నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.