#MostEligiblebachelor కొత్త పిక్.. జంట సూపర్ ! 


అఖిల్ అక్కినేని నాల్గో చిత్రం #MostEligiblebachelor బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఆ విషయాన్ని తెలుపుతూ పూజా హెగ్డే ఓ ఫోటోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి అఖిల్-పూజా పిక్ ఒకటి బయటికొచ్చింది. చాలా డీసెంట్ గా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంట బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కథానాయిక పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంటుందట. అందుకే ఏరికోరి పూజా హెగ్డే ని తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ లో పూజా అఖిల్ ని డామినేట్ చేసింది. తన కాలి గోరు వేళ్లతో అఖిల్ మెడని గోకుంది. అయితే ఇదంతా ప్రచారం కోసమే. సినిమాలో అఖిల్ పాత్ర కూడా బలంగా ఉంటుంది. అది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాతో అఖిల్ తొలి హిట్ ని అందుకోవాలని ఆశతో ఉన్నారు. మరీ ఆ కోరిక తీరుతుందేమో చూడాలి.