అభిజిత్ ప్రేమలో సుజాత.. !
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా రెండో వారాన్ని పూర్తి చేసుకోబోతుంది. ఈ రెండు వారాల్లో ఇంట్లో రొమాన్స్ డోస్ పెరిగింది. కొత్త ప్రేమ జంటలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే అఖిల్-మోనాల్-అభిజిత్ ల మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుతోంది. గురువారం షోలో అభిజిత్-సుజాతల మధ్య ఆసక్తికర సీన్ జరగింది.
ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా ఇంట్లో ఉండే ఒక అబ్బాయిని నువ్వుసెలక్ట్ చేసుకోవాలి అని హారిక సుజాతను అడిగింది. అందరూ అక్క, తమ్ముడు అవుతారు, పోనీ అభి పేరు చెప్తావా అనగానే అతడు ఛీఛీ సుజాత నాకు చెల్లి అని అన్నాడు. చీచీ అన్నందుకు సుజాత నొచ్చుకుంది. ఆ విషయాన్ని చెప్తూ పదేపదే ఏడ్చింది. ఆమెను ఓదార్చేందుకు అభిజిత్ ప్రయత్నించారు. ఇంతలో నోయల్ కల్పించుకుని.. సుజాత నిన్ను ప్రేమిస్తోంది. అది చెప్పలేక ఏడుస్తుందన్నాడు. ఉన్న ప్రాబ్లమ్ ని కాంప్లికేట్ చేయకు బ్రో అని అభిజిత్ నవ్వుతూ కామెంట్ చేశాడు.