బిగ్ బాస్ సభ్యులకి నాగ్ సీరియస్ క్లాస్ 

బిగ్ బాస్ షో సోమ-శుక్రవారం వరకు ఎలా సాగినా.. శని, ఆదివారాలు మాత్రం సరదా సరదా సాగిపోతుంటుంది. హోస్ట్ నాగార్జున సభ్యులతో సరదా సరదా పనులు చేయిస్తారు. నవ్విస్తారు. డబుల్ ఎంటర్ టైన్ మెంట్ పంచుతారు. కానీ, ఈ వారం నాగ్ సీరియస్ గా కనిపించారు. ఇంటి సభ్యులకి ఫుల్లుగా క్లాస్ పీకారు. ఎంట్రీతోనే నాగ్ సీరియస్ గా కనిపించారు. కనీసం ఇంటి సభ్యులని విష్ కూడా చేయలేడు.

మీరు గేమ్ ఆడుతున్నారా ? సేఫ్ గేమ్ అడుతున్నారా?? అని ప్రశ్నించారు. ఆ టైమ్ లో నవ్విన కుమార్ సాయిని.. నువ్వు ఇంట్లో కనీసం నవ్వించడం కూడా లేదని క్లాస్ పీకారు. ఎలిమినేషన్ విషయంలో సభ్యుల ప్రవర్తన గురించి క్లాస్ పీకారు. మొత్తానికి శనివారం బిగ్ బాస్ షో సీరియస్ గా సాగింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. అయితే ఎలిమినేషన్ లిస్టులో ఉన్న గంగవ్వని మొదట సేవ్ చేసేశారు నాగ్.