గుడ్ న్యూస్ : గంగవ్వ కోలుకున్నారు

బిగ్ బాస్ అభిమానులకి గుడ్ న్యూస్. గంగవ్వ కోలుకున్నారు. గురువారం ఏపీసోడ్ లో గంగవ్వ అస్వస్థతకి గురైన సంగతి తెలిసిందే. ఈ వాతావరణం పడతె. తనని బయటికి పంపించమని పరోక్షంగా బిగ్ బాస్ ని కోరింది గంగవ్వ. అయితే బిగ్ బాస్ మాత్రం గంగవ్వని డాక్టర్ రూమ్ కి పంపించి చికిత్స అందించారు. ప్రస్తుతం గంగవ్వ కోలుకున్నారు. షో మొదలు కాగానే నాగ్.. మొదట గంగవ్వని కన్వెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడారు.

గంగవ్వ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. డాక్టర్ రెండుసూదులు ఇచ్చిండు. బాగయింది. నా కూతుళ్లని సూడక.. జర ఎటొఎటో అయిందని అవ్వ నాగ్ కి చెప్పారు. ఇగ చాన రోజులు ఉంటానని చెప్పింది. నాగ్ కూడా ప్రేక్షకులు చెప్పే వరకు గంగవ్వని బయటికి పంపమని చెప్పేశారు. ఇక, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది.

ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో గంగవ్వ, నోయెల్, మోనాల్ గజ్జర్, సోహైల్, కరాటే కల్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజీత్ నామినేషన్‌లో ఉన్నారు. కెప్టెన్ కావడంతో నోయల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. మిగిలిన వారిలో కరాటే కళ్యాణి, కుమార్ సాయి, సోహెల్ కు తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తున్నది.  మరీ.. ఈరోజు ఎవరు ఎలిమినేషన్ కానున్నారు. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అన్నది తెలియాల్సి ఉంది.