చెన్నై టార్గెట్ 163

ఐపీఎల్-13లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. ప్రారంభంలో ముంబై దూకుడుగా ఆడినా.. ఆటకు ముందుకు వెళ్లేకొద్దీ చెన్నై పట్టు బిగించింది. వరుస వికెట్లతో ముంబైని ఒత్తిడిలోని నెట్టింది. భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయగలిగింది. చెన్నై ఆఖరి 5 ఓవర్లలో 36 పరుగులు  ఇచ్చి 4 వికెట్లు తీసింది.

ముంబై ఆటగాళల్లో తివారీ 42 టాప్ స్కోరర్ గా నిలిచారు. చెన్నై బౌలర్లలో Ngidi (3/38) Deepak Chahar (2/32) వికెట్లు తీశారు. ముంబై ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని చెన్నై చేధించాలంటే టాప్ ఆర్డర్ లో కనీసం ఇద్దరు రాణించినా.. ఈజీ కానుంది. ఇక ఈ సారి ఐపీఎల్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతోంది. ఈ సారి హోం అడ్వాటేజ్ ఎవరికి లేదు. గ్యాలరీలో అభిమానులు లేరు. గోల లేదు. కూల్ గా గేమ్ మీదనే ఆటగాళ్లు ఫోకస్ పెట్టొచ్చు.