రాయుడుని తీసుకుంటే టీమిండియా వరల్డ్ కప్ గెలిచేది.. ఇదే రుజువు !
పటిష్టంగా కనిపించిన టీమిండియా 2019 వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయింది. సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై కోహ్లీ సేన వెనుదిగిరింది. సెమీ ఫైనల్ లో నెం.4 వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నెం.4లో అనుభవజ్ఝుడైన ఆటగాడు ఉండి ఉంటే.. 2019 వన్ డే వరల్డ్ కప్ ని టీమిండియా గెలిచేదేనని మాజీలు, క్రికెట్ విశ్లేషలు అభిప్రాయపడ్డారు. సూటిగా చెప్పాలంటే అంబటి రాయుడుని తీసుకుంటే కోహ్లీ సేన వరల్డ్ కప్ ని గెలిచేదేనని చెబుతుంటారు. శనివారం నాటి ఐపీఎల్ మ్యాచ్ ని చూస్తే అది నిజమేనని అనిపించింది.
జట్టు క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు మైదానంలోకి వచ్చిన రాయుడు (71).. జట్టుని విజయతీరాలకు దగ్గర చేర్చే వరకు పట్టుదలతో ఆడాడు.
రాయుడు అనుభవం ఏంటీ ? అన్నది నిన్నటి మ్యాచ్ లో కనబడింది. ఈ మ్యాచ్ ని చూసిన అభిమానులు నిజమే.. రాయుడు ఉంటే టీమిండియా 2019 ఐపీఎల్ గెలిచేదేనని చెప్పుకొంటున్నారు. బీసీసీఐ మాత్రం రాయుడుని కాదని 3డి ఆటగాడు అంటూ.. విజయ్ శంకర్ ని ఎంపిక చేశారు. అతడు ఒత్తిడి తట్టుకోలేక భారీ స్కోరు చేయలేకపోయాడు. ఆ తర్వాత గాయం పాలైన ఓపెన్ ధావన్ స్థానంలోనూ రాయుడుని ఎంపిక చేయలేదు. రిషబ్ పంత్ ని తీసుకున్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే రాయుడు ఎంత విలువైన ఆటగాడు అనేది.. శనివారం ముంబై-చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ తో మరోసారి రుజువైంది.