ఢిల్లీ సూపర్ విన్

ఐపీఎల్ 13 లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ బోణి కొట్టేసింది. సూపర్ ఓవర్ లో గెలిచేసింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. స్టోయినిస్ 53 (21 బంతుల్లో) సూపర్ గా ఆడాడు. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఫటాఫట్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ గా వచ్చిన మయాంక్ అగర్వాల్ 89 (60 బంతుల్లో) జట్టుని గెలుపు అంచుకి తీసుకెళ్లారు. మ్యాచ్ టై అయిన సమయంలో మయాంక్ అవుట్ కావడం.. ఆ తర్వాత మిగిలిన ఉన్న ఆఖరి బంతికి మరో వికెట్ పడటంతో మ్యాచ్ టై అయింది.

ఇక సూపర్ ఓవర్ లో పంజాబ్ పేలవంగా ఆడింది. సూపర్ ఓవర్ లో ఓపెనర్ గా వచ్చిన కె ఎల్ రాహుల్ రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత బంతికే పూరమ్ క్లీన్ బోల్డ్ కావడంతో.. ఢిల్లీ ముందు కేవలం 3 పరుగుల లక్ష్యాన్ని ఉంచినట్టయింది. మూడు పరుగులని ఢిల్లీ రెండు బంతుల్లో చేధించి విజయాన్ని సాధించింది. టీ20 మ్యాచ్ లోని అసలు సిసలు పంచిన మ్యాచ్ ఇది. గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులులాడి ఫైనల్ గా ఢిల్లీని వరించింది.