రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పైఅవిశ్వాస తీర్మానం
లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసు’ బిల్లులని ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. అయితే, సభ్యులు ఓటింగ్ జరపాలని కోరినప్పటికీ డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించడం పట్ల విపక్షాల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఏకంగా డిప్యూటీ ఛైర్మన్ పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి.
వసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు డిప్యూటీ ఛైర్మన్ సహకరించారని ఆరోపిస్తూ 12 పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ తెలిపారు. కాంగ్రెస్, తెరాస, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర పార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. రైతు, వ్యవసాయ విధానాలపై ఇవాళ సభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నోటీసు ఇచ్చామన్నారు. ఇక వ్యవసాయ బిల్లులపై తెరాస వ్యతిరేకించగా.. వైకాపా మద్దతిచ్చింది. దీంతో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న అభిప్రాయాలని తెలిపినట్టయింది.